“రాధే శ్యామ్”లో ప్రేరణ పాత్రకి విషాదాంతం?

Published on Dec 2, 2021 5:00 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ సినిమా రాధే శ్యామ్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మేకర్స్ ఒకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నారు. ఇక నిన్ననే ఈ చిత్రంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హిందీలో భారీ రెస్పాన్స్ ని కూడా ఇది అందుకుంది.

అయితే ఈ సాంగ్ చూసాకే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ సినిమాపై తెలుస్తున్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే పోషించిన క్యూట్ పాత్ర ప్రేరణకి విషాదాంతం తప్పేలా లేదని చెప్పాలి. ఎంతో ఫేమస్ పామిస్ట్ అయ్యినటువంటి విక్రమ్ ఆదిత్య ఆమె చనిపోయాక ఆమె జ్ఞ్యాపకాల్లో ఉంటాడేమో అనే డౌట్స్ ఇది చూసాక కలుగక మానవు.

ఇంకో ముఖ్యమైన విజువల్ తనకి ప్రేరణకి హాస్పిటల్ కనిపించింది చూస్తే ఆమె పాత్ర అలానే ముగుస్తుంది అనే డౌట్ ఇంకా బలపడుతుంది. మరి ఓవరాల్ గా దర్శకుడు రాధా ఎలాంటి ముగింపు ఇచ్చాడో తెలియాలి అంటే వచ్చే జనవరి 14 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :