విషాదం..అనసూయ భరద్వాజ్ తండ్రి కన్నుమూత.!

Published on Dec 5, 2021 12:54 pm IST

తెలుగు బుల్లితెర దగ్గర తనదైన యాంకరింగ్ మరియు లుక్స్ తో ఆకట్టుకునే టాప్ మోస్ట్ యాంకర్ లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకొని ఇపుడు భారీ చిత్రాల్లో నటిస్తూ రెండు చోట్లా కూడా సాఫీగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అనసూయ ఇంట తీరని విషాదం నెలకొంది.

తన తండ్రి ఖస్బ సుదర్శన్ రావు గారు ఈరోజు తన 63 వ ఏట కన్నుమూయడం జరిగింది. అయితే కారణం కూడా తెలుస్తుంది. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తార్నాకలో తుది శ్వాస విడిచారట. దీనితో అనసూయ ఇంట తీరని విషాదం నెలకొంది. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు బృందం కూడా ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం :