విషాదం..టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ బాలయ్య కన్నుమూత.!

Published on Apr 9, 2022 12:00 pm IST

తాజాగా టాలీవుడ్ లో మరో ఊహించని విషాదం నెలకొంది. తెలుగు సినిమాకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు మరియు దర్శక నిర్మాత అయినటువంటి బాలయ్య కన్ను మూసినట్టుగా సినీ వర్గాల్లో కన్ఫర్మ్ అయ్యింది. తెలుగులో దాదాపు 300 కి పైగా సినిమాల్లో కీలక పాత్రల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన అనారోగ్య సమస్యల రీత్యా తన 90వ ఏట కన్ను మూసినట్టుగా ఇపుడు నిర్ధారణ అయ్యింది.

అయితే తెలుగులో తాను నటునిగానే కాకుండా పలు చిత్రాలకి దర్శకునిగానూ అలాగే “నేరం శిక్ష”, “చెల్లెలి కాపురం” వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మరి ఈయన ఇప్పుడు కన్ను మూయడం అనేది టాలీవుడ్ లో ఒక తీరని విషాదం అని చెప్పాలి. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుంది.

సంబంధిత సమాచారం :