విషాదం : ప్రముఖ లెజెండరీ దర్శకుని భార్య కన్నుమూత..!

Published on May 29, 2022 1:36 pm IST

మన ఇండియన్ సినిమా దగ్గర తన సినిమాలతో ఎప్పుడో వరల్డ్ క్లాస్ సబ్జెక్ట్ లతో అద్భుతమైన ట్రీట్ ని ఇచ్చిన అరుదైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు లతో అలరించిన తాను ఇప్పుడు దర్శకత్వానికి దూరంగా ఉండగా ఇప్పుడు వారి ఇంట విషాదం నెలకొన్నట్టుగా తెలిసింది. ఇక వివరాల్లోకి వెళ్లినట్టు అయితే గత కొన్నాళ్ల నుంచి కూడా సింగీతం శ్రీనివాసరావు సతీమణి లక్ష్మి కల్యాణి గత కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండగా ఆమె నిన్న రాత్రి 9 గంటల 10 నిమిషాల కు కన్ను మూసినట్టు గా నిర్దారణ అయ్యింది.

అయితే సింగీతం శ్రీనివాసరావు దంపతులకు 1960లో వివాహం జరుగగా ఆమె ఈ దర్శకునికి అనేక సినిమాల కోసం కూడా సహాయకులు గా వర్క్ చేసారు. మరి ఈ షాకింగ్ వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొనగా పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123 తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.


సంబంధిత సమాచారం :