విషాదం : పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృ వియోగం.!

Published on Jul 5, 2022 11:34 am IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర అత్యంత సాధారణంగా నిరాడంబరంగా ఉండే సీనియర్ నటులలో ఆర్ నారాయణ మూర్తి కూడా ఒకరు. తన కెరీర్ లో ఎన్నో సాలిడ్ చిత్రాలు చేసిన ఆర్ నారాయణ మూర్తి ఇప్పుడు సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవల కొన్ని సమస్యల పట్ల తన గళాన్ని ఎత్తి మాట్లాడిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఇంట ఇపుడు విషాదం నెలకొంది. తన మాతృ మూర్తి రెడ్డి చిట్టమ్మ మరణంతో వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

అయితే ఆర్ నారాయణమూర్తి మాతృమూర్తి రౌతుపూడి మండలం, మల్లం పేటలో గత కొంత కాలం నుంచి వయసుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నందున ఇప్పుడు తన 93వ ఏట కన్ను మూసినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీనితో పలువురు సినీ ప్రముఖులు ఆర్ నారాయణ మూర్తికి ధైర్యం చెబుతూ వారి మాతృమూర్తి మరణం పట్ల నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మా 123 తెలుగు యూనిట్ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :