విషాదం..”రామాయణ్” లెజెండరీ నటుడు కన్నుమూత.!

Published on Oct 6, 2021 3:59 pm IST

భారతదేశ ఇతిహాసం కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయితే దానిని ఏ తరానికి తగ్గట్టుగా ఆ తరానికి ఆ కాలంలో నటులు మేకర్స్ ఎంతో అద్భుతంగా అందిస్తూ వస్తున్నారు. అయితే మన దగ్గర బుల్లితెర మీద ఎంతో పెద్ద హిట్ అయినటువంటి హిందీ “రామాయణ్” ఆ మధ్య మళ్ళీ లాక్ డౌన్ లో అందరికీ చూసే భాగ్యం కలిగింది.

అయితే ఈ అద్భుతమైన ధారావాహికలో రావణాసురునిగా కనిపించి మెప్పించిన నటుడు అరవింద్ త్రివేది నిన్న మంగళవారం తన తుది శ్వాస విడిచినట్టుగా కాస్త ఆలస్యంగా వార్త బయటకి వచ్చింది. అనుకోకుండా గుండెపోటు రావడంతో ఆయన తన 82వ ఏట ఆసుపత్రిలో తన తుది శ్వాసను విడిచారు. దీనితో పలువురు సినీ తారలు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

అయితే ఈ ధారావాహికల్లో రామునిగా చేసిన అరుణ్ గోవిల్ తనకి అరవింద్ త్రివేది కి పాత్ర పరంగా విభేదాలు ఉన్నాయి తప్పితే వ్యక్తిగతంగా ఎలాంటివి లేవని ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మరి భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ ధారావాహిక ఉన్నంత కాలం అరవింద్ త్రివేది గారి పేరు కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. వారి మరణం పట్ల మా 123 తెలుగు యూనిట్ కూడా ఘన నివాళులు అర్పిస్తోంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం :