విషాదం..దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం.!

Published on Nov 28, 2021 9:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ దర్శకుల్లో కింగ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దర్శకుడు శ్రీను వైట్ల అనే చెప్పాలి. తనదైన సినిమాలతో శ్రీను వైట్ల భారీ హిట్స్ ని తెలుగు ఆడియెన్స్ కి అందించారు. మరి ఇప్పుడు అలాంటి శ్రీను వైట్ల ఇంట విషాదం నెలకొంది.

ఈరోజు ఆదివారం తెల్లవారు జామున ఉదయం 4 గంటలకు ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) గారు తన తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న ఆయన గత కొన్నిరోజుల నుంచి వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

మరి ఈ కారణం చేతనే ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దీనితో శ్రీను వైట్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరి ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తూ శ్రీను వైట్ల కుటుంబం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తుంది.

సంబంధిత సమాచారం :