పునీత్ అలా చెయ్యకుండా ఉంటే బాగుండేది..విచారకర నిజం

Published on Oct 30, 2021 10:51 am IST

దక్షిణ భారత సినిమాని ఎంతగానో కలచివేస్తున్న వార్త కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం. అస్సలు ఎవరూ ఊహించని సంఘటన ఇది. అసలు పరిచయం లేని టాలీవుడ్ ఆడియెన్స్ నే ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇక తన అభిమానులు కన్నడ ఇండస్ట్రీ కోసం చెప్పనవసరం లేదు.

అయితే పునీత్ అకాల మరణం వెను వెంటనే సంభవించింది కాదు అని జాతీయ వర్గాలు చెబుతున్నాయి. నిన్న పునీత్ మరణించగా ఆ ముందు రోజు రాత్రే పునీత్ కి కాస్త అస్వస్థత వచ్చింది అట. అయినా కూడా తర్వాత రోజు ఉదయం పునీత్ వ్యాయామం కోసం జిమ్ కి వెళ్లగా అక్కడ ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

దీనితో వైద్య నిపుణులు మరియు సినీ ప్రముఖులు ఒకవేళ ఏదైనా రాత్రి వేళ ఒంట్లో నలతగా ఉంటే ఆ తర్వాత రెండు మూడు రోజులు కూడా వ్యాయామానికి, జిమ్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ పునీత్ కనుక ఆ ముందు రోజు రాత్రే అప్రమత్తం అయ్యినా తర్వాత రోజు జిమ్ కి వెళ్లకుండా ఉన్నా ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఇలాంటి దారుణ నిజాన్ని జీర్ణించుకునే పరిస్థితిలో ఉండేవారు కాదు.

సంబంధిత సమాచారం :

More