కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ది రాజాసాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐతే, ఇటీవల విడుదల చేసిన ‘సహనా సహనా’ సాంగ్ ప్రోమో శ్రోతలను అలరించింది. తాజాగా పూర్తి పాట విడుదల అయింది. ప్రభాస్- నిధి అగర్వాల్ జోడీ ఆకట్టుకునేలా ఉంది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా చాలా చక్కగా పాడారు. ముఖ్యంగా తమన్ కొట్టిన ట్యూన్ కూడా క్యాచీగా ఉంది.
కాగా రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అన్నట్టు ప్రభాస్ తో పాటు, ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
