మెగాస్టార్ – అనిల్ రావిపూడి మూవీపై నిర్మాత కామెంట్స్

మెగాస్టార్ – అనిల్ రావిపూడి మూవీపై నిర్మాత కామెంట్స్

Published on Jan 24, 2025 1:03 AM IST

టాలీవుడ్‌లో హిట్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. వరుసగా 8 సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా మలిచి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇక ఇప్పుడు అందరి చూపు అనిల్ రావిపూడ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించబోయే నెక్స్ట్ మూవీపై పడింది.

అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాపై నిర్మాత సాహు గారపాటి తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘లైలా’ చిత్ర సాంగ్ లాంచ్‌లో ఆయన ఈ మేరకు కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా బ్లాక్‌బస్టర్ ఖాయమని.. ఈ సినిమా ఎమోషనల్ కథతో రాబోతుందని ఆయన తెలిపారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి కెరీర్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయమని ఆయన అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు