మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించడం సినిమాపై అంచనాలను మరింత పెంచగా, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విలేకరులతో ముచ్చటించారు.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రత్యేకత ఏమిటి?
ఇది పూర్తిగా క్లీన్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా. ఇందులో వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని చూస్తారు.
సెన్సార్ రిపోర్ట్ ఎలా వచ్చింది?
చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. సినిమా చూసినవాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతో కలిసి నిర్భయంగా చూసే సినిమా అని చెప్పారు.
చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్‌పై రెస్పాన్స్ ఎలా ఉంది?
ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇద్దరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సోషల్ మీడియాలో మంచి బజ్ కనిపిస్తోంది.
వెంకటేష్ గారి పాత్ర ఎలా ఉండబోతోంది?
వెంకటేష్ గారు చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. ఆయన ఎంట్రీతో ఫన్ మరింత పెరుగుతుంది. ఇది కథలో చాలా కీలకమైన పాత్ర.
చిరంజీవి గారి క్యారెక్టర్ గురించి ఏమంటారు?
చిరంజీవి గారి పాత్రలో ఫన్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. వెంకటేష్ గారితో కలిసి వచ్చే కామెడీ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ట్రైలర్ కేవలం సాంపిల్ మాత్రమే.
ప్రమోషన్స్‌లో చిరంజీవి గారిని ఎప్పటి నుంచి చూస్తాం?
ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఆ తర్వాత చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరూ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు.
ఈ సినిమా టైటిల్ ఐడియా ఎవరిది?
టైటిల్ అనిల్ రావిపూడి గారి ఐడియా. కథ, క్యారెక్టర్‌కు సూట్ అయ్యేలా ఒరిజినల్ పేరే పెట్టాలని ఆయన అనుకున్నారు.
చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఇది సంక్రాంతికి వచ్చే పక్కా విందు సినిమా. కామెడీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉంటాయి. కుటుంబంతో కలిసి థియేటర్‌లో చూసే సినిమా ఇది.
