విశ్వక్ సేన్ పై సాయి ధరమ్ తేజ్ ప్రశంసల వర్షం!

Published on May 5, 2022 3:01 pm IST

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ను మే 6, 2022 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో రుఖ్సర్ డిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం పై యంగ్ హీరో తాజాగా సాయి ధరమ్ తేజ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం కి సంబంధించిన రష్ మరియు ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ నాకు రిలేటెడ్ గా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక పాత్ర కోసం విశ్వక్ సేన్ ఇంతగా ట్రాన్స్ ఫామ్ అవ్వడం పై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :