“కేజీఎఫ్2” పై సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు!

Published on Apr 13, 2022 11:42 pm IST

ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది కేజీఎఫ్2. కేజీఎఫ్ కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022 న విడుదల అవుతున్న సందర్భం గా టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

కేజీఎఫ్ చిత్రం తో భారతీయ సినిమాను ఉర్రూతలుగించారు. అంతేకాక దేశ వ్యాప్తంగా వినిపించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేజీఎఫ్ 2 చిత్రం తో మరోసారి భారతీయ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకోవాలని తెలిపారు. చిత్ర యూనిట్ కి విష్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :