“విరూపాక్ష” ఫస్ట్ సింగిల్ పై సాయి ధరమ్ తేజ క్లారిటీ!

Published on Mar 23, 2023 5:07 pm IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై హీరో సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మా లక్కీ చార్మ్ ను ఇంట్రడ్యూస్ చేయడాన్ని మేము ఎలా మిస్ అయ్యాం. మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఉత్సాహం గా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాం. మా ఫస్ట్ సింగిల్ తో సంయుక్త మీనన్ (నందిని) ను పరిచయం చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. త్వరలో దీని పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను SVCC బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :