విరూపాక్ష: నా గురూజీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రారంభించడం ఒక వేడుక – సాయి ధరమ్ తేజ్

Published on Feb 28, 2023 12:00 pm IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ విరూపాక్ష. కార్తిక్ దండు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూడటం జరిగింది. అయితే ఈ మూమెంట్ పై హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదిక గా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇంకా ఏమీ అడగలేను, విరూపాక్ష నాకు చాలా కీలకమైన అడుగు. నా గురూజీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మంచి మాటలతో ఇలాంటి క్షణాన్ని ప్రారంభించడం వేడుక. కళ్యాణ్ మామా, మీ ప్రేమకు, ప్రశంసలకు, ఎల్లప్పుడూ నాకోసం ఉన్నందుకు థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక పవన్ కళ్యాణ్ టీజర్ ను చూసి, చిత్ర యూనిట్ ను అభినందించిన చిత్రాలను షేర్ చేశారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ మార్చ్ 1 వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :