పవన్ తో వర్క్ పై సాయిధరమ్ తేజ్ బ్యూటిఫుల్ పోస్ట్.!

Published on Feb 22, 2023 11:00 am IST

ఈరోజు మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగా అండ్ సెన్సేషనల్ కాంబో అయితే ఇప్పుడు ఎట్టకేలకు అనౌన్స్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు ఓ రీమేక్ కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. అయితే ఎట్టకేలకు ఈరోజు మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయగా సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ అయితే పవన్ తో వర్క్ చేయడంపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని పెట్టాడు.

తన గురూ తన మామ అయినటువంటి పవన్ కళ్యాణ్ తో సినిమాలో కలిసి వర్క్ చేయడం తన జీవితంలో బెస్ట్ డే అని దీనిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఈ అద్భుతమైన అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందపడుతున్నానని అలాగే మీతో వర్క్ లో మరింత నేర్చుకుంటానని సంతోషంలో ఓ బ్యూటిఫుల్ ఫోటో తో అంతే బ్యూటిఫుల్ పోస్ట్ ని షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసాడు. దీనితో ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :