డైరెక్టర్ దేవకట్టా కి సాయి తేజ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

Published on May 24, 2023 5:25 pm IST

టాలీవుడ్ యంగ్ నటుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రం విజయం తో దూసుకు పోతున్నాడు. తదుపరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో చిత్రం లో కనిపించనున్నారు. అయితే తాజాగా తన డైరెక్టర్ దేవకట్టా కి సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, తనకు రిపబ్లిక్ మూవీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో మూవీ లో నటిస్తున్నారు. ఈ చిత్రం జులై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :