పవన్ గెలుపు.. కాలి నడకన తిరుమలకి మెగా మేనల్లుడు!

పవన్ గెలుపు.. కాలి నడకన తిరుమలకి మెగా మేనల్లుడు!

Published on Jun 15, 2024 1:00 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులు నుంచి జాతీయ స్థాయి వార్తల్లో గట్టిగా వినిపిస్తుండగా పవన్ అందుకున్న రాజకీయ విజయం తన సినిమాల సక్సెస్ కంటే ఎక్కువ కిక్ అని అభిమానులని అంతకు మించి మెగా కుటుంబానికి అందించింది. అయితే పవన్ విజయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు.

సాయి ధరమ్ పవన్ విజయం సాధించిన రోజు నుంచి ఎంతో ఉత్సాహంగా తన మావయ్య విజయాన్ని తన విజయంలా భావించి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఇది ఈ కొన్ని రోజులదే కాదు పవన్ గెలవాలని ఎప్పుడో గట్టిగా మొక్కుకున్నట్టు ఉన్నాడు. అలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మావయ్య కోసం తాను కూడా నిలబడ్డాడు.

మరి మొక్కుకున్నట్టుగానే పవన్ గెలవడంతో సాయి ధరమ్ తేజ్ తిరుమల సన్నిధికి కాలి నడకన బయలుదేరాడు. దీనితో పలు వీడియోలో ఫోటోలు సాయి తేజ్ విషయంలో వైరల్ గా మారాయి. మరి ఈ చర్యతో పవన్ అంటే తేజ్ కి ఎంత గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మెగా అభిమానుల్లో కూడా సాయి ధరమ్ తేజ్ మరో మెట్టు ఎక్కేసాడు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు