ఈ మెగా హీరో డేడికేషన్ చూస్తే ముచ్చటేస్తుంది !
Published on Jul 25, 2016 11:17 am IST

thikka

సుప్రీం హీరో ‘సాయి ధరమ్ తేజ్’ తాజాగా నటించిన చిత్రం ‘తిక్క’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. ఈ పనుల్లో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్ తన వంతు డబ్బింగ్ ను కేవలం 4 రోజుల్లో పూర్తి చెయ్యడం విశేషం.

మంచి సినిమాలను ఎంచుకోవడం, చాలా స్పీడుగా వాటిని పూర్తి చేయడం, నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ భరోసా ఇవ్వడం వంటి లక్షణాలున్న ఈ మెగా హీరోని చూసి మెగా అభిమానులనంతా తెగ ముచ్చటపడుతున్నారు. ఇకపోతే సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తేజ్ సరసన ‘లారిస్సా బొనెసి’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జూలై 30న శిల్పకళా వేదికలో జరగనుండగా సినిమా ఆగష్టు 13న విడుదలకానుంది.

 
Like us on Facebook