సాయి తేజ్ హెల్త్ బులెటిన్.. అపోలో వైద్యులు ఏం చెప్పారంటే?

Published on Sep 11, 2021 1:51 am IST


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హెల్త్ కండీషన్‌పై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా అపోలో ఆసుపత్రి వైద్యులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి హెల్త్ బులెటిన్‌ని విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అన్నారు.

అయితే ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం బ్రెయిన్‌కి సంబంధించి ఎలాంటి మేజర్ ఇంజ్యూరీస్ అయితే లేవని చెప్పారు. తేజ్ కండీషన్‌ను ప్రత్యేక బృందం పరిశీలిస్తుందని, మరో 24 గంటలు గడిస్తే కాస్త కోలుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం అత్యవసరంగా తేజ్‌కి ఎలాంటి ఆపరేషన్‌లు అవసరం లేదని చెప్పుకొచ్చారు. రేపు ఉదయం 9 తర్వాత తేజ్ కండీషన్‌పై తదుపరి హెల్త్ అప్డేట్‌ని రిలీజ్ చేస్తామని అపోలో వైద్యులు తెలిపారు.

సంబంధిత సమాచారం :