సాయి ధరమ్‌ తేజ్ లేటెస్ట్ హెల్త్ బులెటిన్ విడుదల..!

Published on Sep 18, 2021 7:23 pm IST


మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా అపోలో హాస్పిటల్స్‌ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం సాయి తేజ్‌ స్పృహలోనే ఉన్నారని, వెంటిలేర్‌ను కూడా తొలిగించామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. అయితే చికిత్స నిమిత్తం మరికొన్ని రోజుల పాటు సాయి తేజ్ ఆసుపత్రిలోనే ఉంటారని తెలిపారు.

కాగా గత శుక్రవారం సాయి తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళుతుండగా బైక్ స్కిడ్ అయ్యి కిందపడడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అపోలో ఆసుపత్రిలోనే ఆయనకు చికిత్స జరుగుతుంది.

సంబంధిత సమాచారం :