హీరో సాయి ధరమ్ తేజ్‌ తాజా హెల్త్ బులెటిన్ విడుదల..!

Published on Sep 11, 2021 7:30 pm IST

మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో సాయి తేజ్‌కి చికిత్స అందుతుంది. అయితే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన పనిలేదని నిన్నటి నుంచి వైద్యులు చెబుతూనే ఉన్నారు.

అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్‌ హెల్త్ కండీషన్‌పై అపోలో వైద్యులు మరో హెల్త్ బులెటిన్‌ని విడుదల చేశారు. సాయి తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, చికిత్సకు సహకరిస్తున్నాడని వైద్యులు తెలిపారు. అంతర్గతంగా ఎలాంటి గాయాలు అయితే కాలేదని, మరో 24 గంటల్లో సాయి తేజ్ స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని, స్పృహలోకి వచ్చిన తర్వాతే కాలర్ బోన్ శస్త్ర చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :