త్వరలో కలుద్దాం…సాయి ధరమ్ తేజ్ సరికొత్త పోస్ట్!

Published on Oct 3, 2021 7:11 pm IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవాకట్టా దర్శకత్వం లో పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం ఇటీవల విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మేరకు తన సినిమా పై వస్తున్న ఆదరణ చూసి, తన పై చూపిస్తున్న ప్రేమ పట్ల హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదిక గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

నా పై మరియు నా చిత్రం పై మీ ప్రేమ మరియు ఆప్యాయత కి కృతజ్ఞతలు తెలపడానికి ధన్యవాదాలు చాలా చిన్నపదం అని అన్నారు. త్వరలో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేశారు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :