సాయి ధరమ్ తేజ్‌ మెడికల్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!

Published on Sep 11, 2021 12:06 am IST

హీరో సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సమయంలో హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో తేజ్ కిందపడిపోయాడు. ఛాతి, కన్ను, పొట్ట భాగంలో బలమైన గాయాలు కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. దీంతో తొలుత ఆయనను మాదాపూర్ మెడికోవర్ ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ చేశారు.

అయితే మెరుగైన వైద్యం కోసం తేజ్‌ని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న తేజ్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తేజ్‌కు క్లావికల్ ఫ్రాక్చర్ అయ్యిందని తేలగా, బ్రెయిన్ స్కాన్ మాత్రం నార్మల్‌గానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరి కొద్ది గంటలు గడిస్తే కానీ తేజ్ స్ప్రహలోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యాడని తెలీగానే మెగా కుటుంబమంతా ఒక్కొక్కరిగా ఆసుపత్రికి వస్తూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :