రిపబ్లిక్ పై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు – సాయి ధరమ్ తేజ్

Published on Nov 26, 2021 8:00 pm IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. జే బీ ఎంటర్ టైన్మెంట్స్ జీ 5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లో రమ్య కృష్ణ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రం తాజాగా జీ 5 లోకి రావడం జరిగింది.

డిజిటల్ ప్రీమియర్ గా జీ 5 లోకి రావడం తో సాయి ధరమ్ తేజ్ అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం సినిమా బావుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా రిపబ్లిక్ చిత్రం జీ 5 లో ప్రసారం అవుతుండటం పట్ల సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదిక గా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రిపబ్లిక్ చిత్రం పై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ శుక్రవారం నాకు చాలా స్పెషల్ అని అన్నారు. అంతేకాక రిపబ్లిక్ టీమ్ తో సినిమాను చూస్తున్న వీడియో ను షేర్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :