సాయి తేజ్ ‘రిపబ్లిక్’ రిలీజ్‌పై అవన్ని అపోహలేనా?

Published on Sep 18, 2021 2:08 am IST


సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరో హీరోయిన్‌లుగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జే.భగవాన్ మరియు జే.పుల్లారావులు నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అయితే ఇటీవల సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.
అయితే సాయితేజ్ ఇంత తక్కువ సమయంలో కోలుకుని ప్రమోషన్స్‌లో పాల్గొనడం కష్టమేనని, దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్టు ఓ పక్క ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సినిమా మార్కెట్‌ను జీ స్టూడియోస్ వారు చూసుకుంటున్నారని, ముందుగా చెప్పిన ప్రకారమే రిపబ్లిక్ సినిమాను అక్టోబర్ 1వ తేదినే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి మరోసారి అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు దేవ కట్టాతో పాటు, రమ్యకృష్ణ, జగపతిబాబు పాల్గొంటారని టాక్.

సంబంధిత సమాచారం :