“బంగార్రాజు” తప్పకుండా జోష్ నింపుతుంది – సాయి ధరమ్‌ తేజ్

Published on Jan 14, 2022 3:01 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టిలు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం “బంగార్రాజు”. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న అనగా నేడు థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ఈ నేపధ్యంలోనే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ బంగార్రాజు చిత్ర బృందానికి ఆల్‌దిబెస్ట్ తెలియచేశాడు. ఈ పండుగ సీజన్‌లో స్క్రీన్‌పై డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని, ఖచ్చితంగా ఈ సినిమా మీలో జోష్ నింపడం గ్యారంటీ అని సాయి తేజ్ రాసుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :