ఇంటర్వ్యూ : ధరమ్ తేజ్ – అంత డబ్బు పెట్టినందుకు ఏం ఫీలవ్వడం లేదు !

28th, February 2017 - 02:04:51 PM


ఈ ఏడాది చిరంజీవి తర్వాత మెగా కుటుంబం నుండి సుప్రీం హీరో ధరమ్ తేజ్ ‘విన్నర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదటి నుండి మంచి క్రేజ్ ను బిల్డప్ చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రంతో తేజ్ తన కెరీర్లోనే ఉత్తమమైన ఓపెనింగ్స్ సాధించాడు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజ్ మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) సినిమాకి ప్రేక్షకుల రెస్పాన్స్ బాగుంది. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. రోజు రోజుకి స్పందన పెరుగుతుడటం నాకు, నా నిర్మాతలకు చాలా సంతోషం కలిగిస్తోంది.

ప్ర) ‘విన్నర్’ మీ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది కదా ఎలా ఫీలవుతున్నారు ?
జ) నిజంగా నేను ఈ కలెక్షన్ల లెక్కల్ని, నెంబర్ గేమ్ ని పెద్దగా పట్టించుకోను. నేను చేయగలిగిందంతా చేశాను. నా నిర్మాతలకు పెట్టిన డబ్బు తిరిగొచ్చేస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది.

ప్ర) నిర్మాతలు మీ మీద ఎక్కువ డబ్బు పెట్టారని మీకనిపించిందా ?
జ) లేదు. నిర్మాతలు డబ్బు పెట్టింది నా మీద కాదు. మంచి స్టోరీ లైన్ మీద. సబ్జెక్ట్ హెవీగా ఉంది. దాన్ని గొప్పగా తీయాలంటే డబ్బు కాస్త ఎక్కువే పెట్టాలి. రిచ్ విజువల్స్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. ప్రతి ఒక్కరు వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అస్సలు ఫీలవడం లేదు.

ప్ర) మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి ?
జ) మా అమ్మ చాలా సంతోషించారు. మా సోదరుడు, ఫ్రెండ్, నటుడు నవీన్ నా బెస్ట్ క్రిటిక్స్. వాళ్లందరికీ సినిమా నచ్చింది. ముఖ్యంగా జగపతిబాబుగారితో ఉండే సన్నివేశాలు చాలా బాగున్నాయంటున్నారు.

ప్ర) జగపతిబాబుగారితో పని చేయడం ఎలా ఉంది ?
జ) ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమమైన నటుల్లో జగపతిబాబు కూడా ఒకరు. నెను రీ టెక్స్ తీసుకునేప్పుడు చాలా ఇపిగ్గా ఉండేవారు. ఆయన సపోర్ట్ నాకే మరీ ఎక్కువగా ఉందనిపించింది.

ప్ర) సినిమాలో మెగా హీరోల రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. వాటి గురించి ?
జ) లేదు. అవన్నీ దర్శకుడి ఆలోచనలే. ఆయన చెప్పినట్టే చేశాను. ఒకసారి సెట్లోకి అడుగుపెట్టాక పూర్తిగా దర్శకుల హీరోగా మారిపోతాను. వాళ్ళు ఏది చెబితే అది చేసేస్తాను.

ప్ర) మీ స్టైలిష్ లుక్ వెనుక సీక్రెట్ ఏంటి ?
జ) అంతా ప్లాన్ ప్రకారమే చేశాం. ఒక న్యూస్ పేపర్ క్రియేటివ్ హెడ్ కాబట్టి అలా స్టైలిష్ లుక్ ట్రై చేశాం. నా లుక్ అంత స్టైలిష్ గా ఉండటానికి నా టీమే కారణం. క్రెడిట్ అంతా వాళ్లదే.