మెగాస్టార్‌కి కొడుకుగా మేనల్లుడు నటించబోతున్నాడా?

Published on Apr 13, 2022 2:01 am IST

మెగాస్టార్ చిరంజీవి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య” చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఇది కాకుండా మరో నాలుగు సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో మూడు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో సినిమాని కూడా చిరు లైన్‌లో పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.

మలయాళంలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న బ్రోడాడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, ఈ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతను డైరెక్టర్ హరీష్‌‌ శంకర్‌కి చిరు అప్పజేప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్‌‌లో చేయాల్సిన మార్పులు గురించి చిరు ఇప్పటికే హరీష్‌‌తో డిస్కస్ చేశారట. మోహన్‌‌లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించారు. అయితే ఈ సినిమాలో చిరుకి కొడుకు పాత్రలో ముందుగా వరుణ్ తేజ్ పేరు బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ రోల్‌‌‌‌‌కి సాయి ధరమ్ తేజ్‌ని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పోలికల పరంగా చూస్తే వరుణ్ కంటే సాయిధరమ్ తేజ్‌‌లో చిరంజీవి పోలికలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో సాయిని ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :