సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ రన్‌టైమ్ ఎంతంటే..!

సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ రన్‌టైమ్ ఎంతంటే..!

Published on Aug 11, 2016 10:54 AM IST

thikka
వరుస విజయాలతో జోరు మీద ఉన్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్, తన కొత్త సినిమా ‘తిక్క’ను కూడా అప్పుడే విడుదలకు సిద్ధం చేసేశారు. ఈ శనివారం (ఆగష్టు 13న) విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇప్పటికే తారాస్థాయికి చేరిపోయాయి. ఇక ఈ ప్రమోషన్స్‌లోనే టీమ్ తమ సినిమాకు కామెడీయే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతూ వస్తోంది. ఇప్పటికే సెన్సార్ సహా అన్ని ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా 2 గంటల 19 నిమిషాల నిడివితో ఉంటుందని నిర్మాత తెలిపారు.

బ్రేకప్ చుట్టూ తిరిగే కథ కావడంతో యువత ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారని, ఈతరం ప్రేమలను కొత్తదనమున్న కథ, కథనాలతో పరిచయం చేయనున్న సినిమాగా తిక్క నిలుస్తుందని టీమ్ చెబుతోంది. ‘ఓం’ ఫేం సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రోహిణ్ రెడ్డి నిర్మించారు. థమన్ అందించిన ఆడియో ఇప్పటికే సూపర్ క్లిక్ అయిన ఈ సినిమాలో లారిస్సా బొనెస్సి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు