“ది వారియర్” తో హ్యూజ్ సక్సెస్ అబ్బాయ్ – సాయి ధరమ్ తేజ్

Published on Jul 13, 2022 10:00 pm IST

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ది వారియర్. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కి సిద్దం అవుతోంది. జూలై 14, 2022 న థియేటర్ల లో చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ యంగ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషెస్ తెలిపారు. ది వారియర్ చిత్రం తో హ్యూజ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా అబ్బాయ్ రామ్ అంటూ సాయి ధరమ్ తేజ్ తెలిపారు. బుల్లెట్ బ్లాక్ బస్టర్ తో అందరి విజిల్స్ గెలవాలి అంటూ చెప్పుకొచ్చారు.

సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆది పినిశెట్టి ఈ చిత్రం లో విలన్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :