సాయి తేజ్ డిశ్చార్జ్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Sep 21, 2021 11:08 am IST


మెగా మేనల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా తేజ్‌ హెల్త్ బులెటిన్ విషయానికి వస్తే.. సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. సాయి తేజ్ కి వెంటిలేటర్‌ తొలగించామని.. ఆయన స్పృహలోనే ఉన్నారని పూర్తిగా కోలుకున్నార‌ని అపోలో ఆసుప్ర‌తి టీమ్ తెలియజేసింది.

ప్రస్తుతం సాయి తేజ్ బాగా మాట్లాడుతున్నార‌ని, ఇక రెండు మూడు రోజుల్లోనే సాయి తేజ్ ను డిశ్చార్జ్ కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అపోలో హాస్పిట‌ల్‌ కు సంబంధించిన న‌లుగురు డాక్ట‌ర్స్ బృందం తేజ్ ఆరోగ్యాన్ని దగ్గర ఉండి ప‌ర్య‌వేక్షించారు. ఇక తేజ్ ప్రస్తుతం దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా న‌టించిన ‘రిప‌బ్లిక్‌’ సినిమా అక్టోబ‌ర్ 1న రిలీజ్ అవుతుంది.

సంబంధిత సమాచారం :