సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” టీజర్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Mar 5, 2023 6:00 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ హీరోగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ చిత్రం ను ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ 2 రోజుల క్రితం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ టీజర్ ఫ్రెష్ గా ఉండటం మాత్రమే కాకుండా, డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఆకట్టుకుంది. ఈ టీజర్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :