టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రీం సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. తాజాగా ఈ చిత్రం టీజర్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో మిస్టరీ థ్రిల్లర్ గా టీజర్ ఉంది. టీజర్ లోని విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ మరింత హైలైట్ గా నిలిచింది.
శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ల పై సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తో పాటుగా హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.