నేడు రిలీజ్ కానున్న సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” టీజర్

Published on Mar 2, 2023 11:30 am IST

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరియు సంయుక్త మీనన్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ను విడుదల చేయడం జరిగింది. టీజర్ ను నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ టీజర్ ను చూసి ప్రశంసించారు. ఈ నేపథ్యంలో, టీజర్‌పై అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ యొక్క మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కానుంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ మరియు BVSN ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :