నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. ఢిల్లీలో జరిగిన ‘ప్రథమ్ సంకల్ప్’ వేడుకలో సాయి పల్లవి మాట్లాడుతూ, నటీనటులకు సీతాదేవి వంటి పవిత్రమైన పాత్ర దక్కడం అంత సులభం కాదని, ఇది తన అదృష్టమని పేర్కొంది.
ఈ పాత్రకు న్యాయం చేయడం కోసం తాను నిరంతరం ధ్యానం చేస్తూ, తన ఆలోచనలను పవిత్రంగా ఉంచుకునేదాన్ని అని చెప్పింది. సీతాదేవే తన ద్వారా నటింపజేయాలని ప్రార్థించేదాన్ని అని, ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఈ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం ఎంతో కష్టపడుతోందని ఆమె తెలిపింది.
