సిరివెన్నెల గారు, మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు – సాయి పల్లవి

Published on Dec 7, 2021 6:05 pm IST


నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మురళి శర్మ, అభినవ్ గోమతం లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి సిరివెన్నెల లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాయడం విశేషం.సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన చివరి పాట కావడం తో చిత్ర యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఈ చిత్రం లో నటించిన సాయి పల్లవి భావోద్వేగం అయ్యారు. మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తుంది. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు అంటూ సాయి పల్లవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :