ఫ్యాన్స్ అరుపులు, కేకలు.. స్టేజ్‌పైనే ఏడ్చేసిన సాయి పల్లవి..!

Published on Dec 19, 2021 2:20 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంట నీరు పెట్టుకుంది. ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి పల్లవి ఎమోషనల్ అవుతూ స్టేజ్‌పైనే కంట నీరు పెట్టుకుంది.

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం, కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి పల్లవి కంట నీరు పెట్టుకోంది. ఇదిలా ఉంటే ఒక హీరోయిన్ పేరు వినగానే ఫ్యాన్స్ అంతలా అరవడం చాలా అరుదని తెలుస్తోంది. ఇంతటి అభిమానుల ప్రేమను చూసిన సాయి పల్లవి స్టేజిపైనే ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :