రామ్ చరణ్ కి సాయి పల్లవి ఎగ్జైటింగ్ రిప్లై.!

Published on Jan 9, 2022 2:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కి దొరికిన ఊహించని బ్రేక్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. ఇక అలాగే ఇదే గ్యాప్ లో చరణ్ లేటెస్ట్ హిట్ సినిమాలు కూడా చూడడం స్టార్ట్ చేసినట్టున్నాడు. అలా మొన్న సేనాపతి సినిమా చూసి తన స్పందనను తెలియజేసి వారి సినిమా యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు.

మరి మళ్ళీ రీసెంట్ మరో బ్లాక్ బస్టర్ “శ్యామ్ సింగ రాయ్” సినిమా చూసి హీరో నాని, హీరోయిన్స్ సాయి పల్లవి మరియు కృతి శెట్టి లకి కంగ్రాట్స్ చెప్పాడు. అయితే నాని మరియు సాయి పల్లవి ల పెర్ఫామెన్స్ లు బ్రిలియెంట్ గా ఉన్నాయని చెప్పగా నిన్ననే నాని ఆల్రెడీ స్పందించి తన రిప్లై ఇచ్చాడు.

ఇక ఇప్పుడు సాయి పల్లవి తన ఎగ్జైటింగ్ రిప్లై ని ఇచ్చింది. మా కోసం మీరు టైం తీసుకొని చూడడం చూసి సినిమాని మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలిపింది. అలాగే చరణ్ “RRR” సినిమా కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సాయి పల్లవి తెలిపింది. దీనితో వీరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :