మహేష్ బాబు సిస్టర్ గా ‘సాయి పల్లవి’ ఫైనల్ ?

మహేష్ బాబు సిస్టర్ గా ‘సాయి పల్లవి’ ఫైనల్ ?

Published on Jan 17, 2022 7:06 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో సిస్టర్ పాత్ర కీలకం కానుందని తెలుస్తోంది. పైగా సినిమాలో మెయిన్ పాయింట్ కూడా సిస్టర్ పాత్రకే లింక్ అయి ఉంటుందట. అందుకే, ఈ కీలక పాత్రలో క్రేజీ హీరోయిన్ ‘సాయి పల్లవి’ని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మహేష్ సిస్టర్ గా సాయి పల్లవి నటిస్తే.. నిజంగానే కాంబినేషన్ అదిరిపోతోంది. ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుందట. ఏప్రిల్ నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీస్తారట. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు