తన కామెంట్స్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి.!

Published on Jun 19, 2022 11:00 am IST

లేడీ పవర్ స్టార్ భారీ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “విరాట పర్వం” కోసం అందరికీ తెలిసిందే. రానా దగ్గుబాటి హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి పల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలో చేసిన పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వేరే విధంగా వెళ్లగా మొదటిసారి సాయి పల్లవి ఇలాంటి కాంట్రవర్సీలలోకి లాగబడింది.

అయితే దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ ఒక సునిశిత క్లారిటీని అందించింది. చాలా క్లారిటీ గా మాట్లాడుతూ నేను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పలు వార్తా మాధ్యమాల్లో వేరే విధంగా వెళ్లాయని అందుకే నేను వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నానని తెలిపింది. మొదటగా నేను మనుషులను ప్రాంతాలు మతాల వారీగా చూడను అని కేవలం మనిషి గానే చూస్తాను ఆ తర్వాత మిగతా అన్ని అని తెలిపింది. అలాగే నేను ఎప్పుడూ కూడా తటస్థంగానే స్పందిస్తాను మొన్న కూడా అలాగే చెప్పాను అది కాస్త వేరే విధంగా వెళ్ళిపోయింది.

నేను కూడా ఒక డాక్టర్ ని మాకు మనుషులు అంతా ఒకటే అని ఉంటుంది చిన్నప్పుడు నేను స్కూల్ చదివే టైం లో కూడా భారతీయులు అంతా నా సహోదరులు అనే మాట బలంగా నా మదిలో ఉండిపోయి ఉండొచ్చు అందుకే నేను ఇలా ఉన్నానని అప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి కూడా దర్శకునితో పలు అంశాలపై మాట్లాడానని హింస అనేది ఎవరు చేసిన ఏ మతంలో చేసినా అది మహా పాపం లాంటిది అని ఈ విషయంలో తనకి సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని సాయి పల్లవి క్లుప్తంగా ఒక క్లారిటీని అయితే ఇచ్చింది.

సంబంధిత సమాచారం :