మల్టీ స్టారర్ పై మొగ్గుచూపుతున్న సాయి పల్లవి ?

11th, December 2017 - 08:32:39 AM

చేసిన మొదటి సినిమా ‘ఫిదా’ తోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను సంపూర్ణంగా గెలుచుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె దిల్ రాజు నిర్మాణంలో నాని సరసన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమాలో నటించింది. ఈ నెల 21న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇకపోతే సాయి పల్లవి ముందున్న ప్రాజెక్ట్స్ లో హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్న మల్టీ స్టారర్ కూడా ఉందట.

నితిన్, శర్వానంద్ లు హీరోలుగా చేస్తారని చెప్పబడుతున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలనే యోచనలో ఉన్నారట నిర్మాత దిల్ రాజు. సాయి పల్లవి కూడా ఏ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ క్లారిఫికేషన్ రాలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి గనుక సెట్టైతే నిర్మాత దిల్ రాజుతో ఆమెకిది మూడవ సినిమా అవుతుంది.