మెగాస్టార్ డాన్స్ పై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్.!

Published on Jun 11, 2022 4:02 pm IST

మన ఇండియన్ సినిమా దగ్గరే డాన్స్ అంటే ఒక స్పెషల్ మార్క్ ని సెట్ చేసి పెట్టిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ కూడా తన మార్క్ గ్రేస్ డాన్స్ లతో ఆకట్టుకుంటున్న చిరు ఎన్నో ఏళ్ల నుంచి తన డాన్స్ తో ఇండియన్ సినిమా దగ్గర ట్రెండ్ సెట్ చేసి పెట్టారు. అయితే లేటెస్ట్ జెనరేషన్ లో సాలిడ్ గా డాన్స్ చేసే హీరోయిన్ చాలా తక్కువమందే ఉన్నారు. మరి అలాంటి యంగ్ హీరోయిన్స్ లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఉంది.

మరి సాయి పల్లవి లేటెస్ట్ గా మెగాస్టార్ డాన్స్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. మెగాస్టార్ ముఠామేస్త్రి లో ఈ పేటకు నేనే మేస్త్రి సాంగ్ లో ఐకానిక్ స్టెప్ ని నేను చాలా సార్లు ట్రై చేసానని కానీ ఆయనలా మాత్రం చేయలేకపోయేదానిని అని అలాగే నడక కలిసిన నవరాత్రి సాంగ్ లో మెగాస్టార్ గ్రేస్ అయితే చాలా ఇష్టం అది అది ఎవరికీ రాదు అని చిరు డాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీనితో ఇవి మెగా ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :