కూలీగా మారిన సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

Published on Apr 3, 2022 4:42 pm IST

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి గొప్ప నటే కాదు, గొప్ప వ్యక్తి కూడా. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని.. సినిమా రంగంలో సాయి పల్లవిలా ఉండటం చాలా అరుదు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే, ఆ టాక్ కి తగ్గట్టుగానే సాయి పల్లవి కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను నెటిజన్లను ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తుంది. అసలు ఏ హీరోయిన్ అయినా కూలీ పనులు చేస్తోందా ?

కానీ సాయిపల్లవి చేసింది. కూలీగా మారిపోయింది. ఈ అందాల ముద్దుగుమ్మ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తగా ట్రై చేసింది. అందులో భాగంగా సాయి పల్లవి రైతుగా మారింది. కూలీలతో కలిసి పనులు కూడా చేసింది. పైగా ఈ ఫోటోలను సాయిపల్లవి తన ఇన్‌ స్టా లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆ ఫోటోలను లైక్ షేర్ లతో వైరల్ చేస్తున్నారు. ఇక సాయిపల్లవి నీలా ఎవ్వరూ ఉండలేరంటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా కామెంట్ చేయడం విశేషం.

సంబంధిత సమాచారం :