శివ కార్తికేయన్ 21 లోకి “సాయి పల్లవి”

Published on May 10, 2022 1:50 am IST


శివ కార్తికేయన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ హీరో నటించిన డాన్ చిత్రం ఒక పక్క విడుదల కి సిద్దం అవుతోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం లో శివ కార్తికేయన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. #SK21 గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ యొక్క రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై సోని పిక్చర్స్ ఇండియా తో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లోకి తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రం లో రష్మీక మందన్న మరో లేడీ లీడ్ రోల్ లో నటిస్తుండగా, హరీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :