సాయి పల్లవి తమిళ్ సినిమా సైన్ చేసింది !

హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈ హీరో నటించిన ”గ్యాంగ్” సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత సూర్య దర్శకుడు సెల్వ రాఘవన్ తో సినిమా చెయ్యబోతున్నాడు. త్వరలో మొదలు కానున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

సెల్వ రాఘవన్ తెలుగులో “7/జి బృందావన్ కాలనీ” “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” ”యుగానికి ఒక్కడు” వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ మూవీస్ తీసే డైరెక్టర్ తో విలక్షణ నటుడు తోడైతే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఉహించగలం. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.