తనని “లేడీ పవర్ స్టార్” అనడంపై సాయి పల్లవి ఊహించని రియాక్షన్.!

Published on Jun 15, 2022 9:09 am IST


సౌత్ ఇండియన్ సినిమా దగ్గర నాచురల్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి. అయితే ఈ హీరోయిన్ కి యూత్ లో భారీ క్రేజ్ ఉంది. తన నుంచి ఓ సాంగ్ వస్తుంది అంటే అది రికార్డు వ్యూస్ కొల్లగొట్టడం గ్యారెంటీ. మరి ఇదిలా ఉండగా ఈమెకున్న భారీ క్రేజ్ ను చూసి టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈమెకి ఏకంగా “లేడీ పవర్ స్టార్” అంటూ బిరుదు ఇచ్చేసారు.

అయితే అక్కడ నుంచి ఈమెని అంతా కూడా అలాగే పిలుస్తున్నారు. మరి అసలు ఈమెని అలా పిలవడంపై తన క్లారిటీని సాయి పల్లవి ఇచ్చింది. లేటెస్ట్ గా “విరాట పర్వం” ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనని లేడీ పవర్ స్టార్ అంటూ ఎవరైనా అంటే నాకే కొంచెం అతిగా అనిపిస్తుంది అని నిజానికి నాకు అలా పిలిపించుకోవడం ఇష్టం లేదని నేనిక్కడ కేవలం అందరితో గౌరవంగా పని చేయడానికి వచ్చాను కానీ స్టార్డం ని చూసి వచ్చే వాళ్ళతో కాదని తెలిపింది.

సంబంధిత సమాచారం :