నాగశౌర్యతో గొడవ.. మూడేళ్ల తర్వాత స్పందించిన సాయిపల్లవి..!

Published on Feb 5, 2022 3:00 am IST

“ఫిదా” చిత్రంతో సూపర్ క్రేజ్‌ని తెచ్చుకున్న సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల “శ్యామ్ సింగరాయ్” చిత్రంతో కూడా మంచి మార్కులే కొట్టేసిన ఈ అమ్మడుపై గతంలో కొన్ని విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. షూటింగ్ సెట్‌లో పొగరు చూపిస్తుందని, ఆటిట్యూడ్‌గా ఉంటుందని హీరో నానితో, నాగ శౌర్యతో సాయి పల్లవికి గొడవలు ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి.

అయితే యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి సాయిపల్లవి “కణం” మూవీలో నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో సాయి పల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానని మూడేళ్ల కిందట నాగశౌర్య కామెంట్స్ చేశాడు. అయితే నాగశౌర్య వ్యాఖ్యలపై మూడేళ్ళ తరువాత సాయి పల్లవి స్పందించింది. గతంలో హీరో నాగశౌర్య నాపై కొన్ని కామెంట్స్‌ చేశాడు. అవి విని నేను చాలా బాధపడ్డానని, శౌర్య అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన నటన బావుంటుందని అన్నారు. అయితే నాలో నచ్చిందే అందరు చెప్తారు.. కానీ శౌర్య నాలో నచ్చని విషయం చెప్పాడు. దానిని నేను పాజిటివ్ గానే తీసుకున్నానని, నా వలన తను ఇబ్బంది పడితే నేను బాధపడినట్లే. నా సమాధానంతో తను సంతృప్తి చెందుతాడని అనుకుంటున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. మూడేళ్ల తర్వాత సాయి పల్లవి ఈ వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత సమాచారం :