డబ్బింగ్ మొదలుపెట్టిన సాయి పల్లవి !

7th, November 2017 - 06:20:03 PM

తెలుగులో చేసిన మొదటి సినిమా ‘ఫిదా’ తోనే అశేష తెలుగు ప్రేక్షకుల మన్ననలను అందుకుంది నటి సాయి పల్లవి. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుందామె. ఆ సినిమాలో ఆమె డైలాగ్స్ చూపిన తీరు, నటించిన విధానానికి తెలుగు ఆడియన్స్ నిజంగానే ఫిదా అయిపోయారు. ఆమె కోసమే మళ్ళీ మళ్ళీ సినిమా చూశారు. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఆమె నెక్స్ట్ నానితో కలిసి ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమా చేస్తోంది.

సాధారణంగానే నాని సినిమాలంటే ఉండే క్రేజ్ అందులో సాయి పల్లవి హీరోయిన్ అనగానే రెట్టింపైంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే సాయి పల్లవి తన పాత్ర తాలూకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.