థియేటర్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

Published on Dec 29, 2021 8:02 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం లో రోజీ గా సాయి పల్లవి విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా హీరోయిన్ సాయి పల్లవి హైదరాబాద్ లోని శ్రీ రాములు ధియేటర్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చింది.

సాయి పల్లవి బుర్ఖా ధరించి శ్యామ్ సింగరాయ్ ను చూసేందుకు రావడం విశేషం. హీరోయిన్ తో పాటుగా దర్శకుడు రాహుల్ సైతం ఉండగా, ఆడియెన్స్ రెస్పాన్స్ ను చూడటం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, విడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. నాని హీరోగా నటించిన ఈ చిత్రం లో కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :